*అవినీతి క్యాన్సర్ లాంటిది*
*జర్నలిస్టులు అవినీతిపై కలం ఎక్కు పెట్టాలి* -హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

ఆయుధం న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 13 :
అవినీతి క్యాన్సర్ లాంటిదని, జర్నలిస్టులు అవినీతిపై కలం ఎక్కు పెట్టాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని చార్మినార్ ప్రాంతంలోని ఉర్దూ ముస్కాన్ ఆడిటోరియంలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్ యూజె (ఐ) జాతీయ స్థాయి సమావేశం రాష్ట్ర టిజెఏ అధ్యక్షుడు రమణ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా గవర్నర్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్ట్ ల పాత్ర ప్రధానమైందన్నారు. వార్తను వార్తలాగే రాయాలి తప్ప మసాలా వేసి లేనిది వున్నట్లు క్రియేట్ చేయొద్దని అన్నారు. కులం, మతం, ప్రాంతీయ బేధం పాత్రికేయుల్లో ఉండరాదని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని, జర్నలిస్ట్ ల రాయితీ పాసుల గురించి మరోసారి కేంద్ర సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకొని వెళ్తామన్నారు. అనంతరం ఎన్ యూజే (ఐ)ఎన్నికల అధికారి ఉప్పల లక్ష్మణ్ మాట్లాడుతూ….ఎన్ యూజే (ఐ)ఎన్నికలు సాఫిగా ప్రశాంత వాతావరణంలో జరగడం, ఎన్నికలకు దేశ నలుమూలల నుండి వచ్చిన జర్నలిస్టులు సహకరించినందుకు సంతోషం వ్యక్తం చేసారు. ఎన్ యూ జే (ఐ)నూతన అధ్యక్షులు శివాజీ సర్కార్ మాట్లాడుతూ… జర్నలిస్ట్ ల రైల్వే రాయితీ పాసుల గురించి, కేంద్రానికి మరో సారి వినతి పత్రం సమర్పిస్తామన్నారు. టోల్ గెట్ లో జర్నలిస్టులకు మినహాయింపు గురించి సంబంధిత శాఖ కేంద్ర మంత్రితో మాట్లాడుతాం అన్నారు. జర్నలిస్ట్ లపై జరిగే దాడులపై ప్రత్యేక ద్రుష్టి పెడ్తామన్నారు. ఈ సమావేశంలో ఎన్ యూ జే (ఐ) సెక్రెటరీ జనరల్ రవి మీనాక్షి సుందరం, ఎన్ యూ జే (ఐ) ఉపాధ్యక్షులు, టీజెఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉక్కల్కర్ రాజేందర్ నాథ్, పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ ఛైర్మెన్ కోలేటి దామోదర్ గుప్తా, టిజెఏ ప్రతినిధులు ఖాసీమ్ అలీ, ఎం ఏ. గౌరీ, ఖలీల్ అహమ్మద్, సంపత్, ఎన్ సీ పీ ఎల్ డైరెక్టర్ ఎం. ఏ. సత్తార్, ఎన్ యూ జే ప్రతినిధులు డి. రాజలింగం, భానుప్రకాష్, శివ ప్రసాద్, బీ ఎస్ ఎస్ శశితో పాటు నూతనంగా ఎంపికైన ఎన్ యూ జే(ఐ)33మంది ప్రతినిధులు, దేశ నలుమూలల నుండి వచ్చిన జర్నలిస్టులు, టీజెఏ జిల్లాల యూనిట్ ప్రతినిధులు హాజరయ్యారు.
Post Views: 20