సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి నుంచి తయారు చేయబడిన రూ. 10 లక్షల విలువ చేసే 964 గ్రాముల హాషీష్ అయిల్ అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తున్న సమయంలో శుక్రవారం సంగారెడ్డి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెట్ టీమ్ పట్టుకున్నారు. గంజాయి, డ్రగ్స్, హషీష్ అయిల్ లాంటి మాదక ద్రవ్వాలను రవాణ చేస్తున్న పలుమార్లు ఎక్సైజ్, పోలీసులకు పట్టుబడిన ఘటనలు హైదరాబాద్ కాటేదాన్ బృందవన్ కాలనీకి చెందిన అనిల్‌కుమార్ యాదవ్‌పై ఉన్నాయి. ఈ కేసుల్లో నిందితుడిగా ఉన్న అనిల్ కుమార్ మళ్లీ విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు రవాణ చేస్తున్న అనిల్ కుమార్‌ను సంగారెడ్డి ఎన్‌ఫోర్స్ మెంట్ టీమ్ పట్టుకున్నారని మెదక్ డిప్యూటి కమిషనర్ జె.హరికిషన్ తెలిపారు. విశాఖ ఏజెన్సీ నుంచి హషీష్ అయిల్ హైదరాబాద్‌కు రవాణ అవుతుందనే పక్కా సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ మెదక్ టీమ్ అక్షయ పౌండేషన్ కంది ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. కంది నుంచి శంకర్‌పల్లికి వెళ్లె రహదారిలో తనిఖీల్లో హషీష్ అయిల్‌ను పట్టుకున్నారు. నిందితుడిని కూడా అరెస్టు చేశారు. అతడి వద్ద ఉన్న రూ. 10లక్షల విలువ చేసే హషీష్ అయిల్‌ను స్వాధీనం చేసుకొని సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. హషీష్ అయిల్‌ను పట్టుకున్న కేసును ఏఈఎస్ కే.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐలు గాంధీ నాయక్, వీణారెడ్డి, చందశ్రేఖర్, ఎస్సైలు అనిల్ కుమార్, యాదయ్య, దీలిఫ్ కుమార్,కానిస్టేబుళ్లు అలీం, అహ్మతుల్లా ఖరీం, రామరావు నాయక్, మోహన్, ఉమారాణి, వివేక్, సయ్యద్ మూజామిల్‌లు పట్టుకున్నారు. హషీష్ అయిల్‌ను పట్టుకున్న టీమ్‌ను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం అభినందించారు.