Site icon PRASHNA AYUDHAM

తల్లిదండ్రుల పేరు చెప్పుకొని రాజకీయాలకు రాలేదు

IMG 20240811 WA0212

*తల్లిదండ్రుల పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కాదు*

*దమ్మున్న నాయకుడు కాబట్టే బండి సంజయ్ కార్పొరేటర్ నుండి కేంద్రమంత్రి స్థాయికి ప్రజా ఆశీస్సులతో ఎదిగిండు*

*అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడే పైటర్ సంజయ్ కుమార్*

*రాజేందర్ రావువ్యాఖ్యలపై బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి ఫైర్*

*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో ఆగస్టు 11*

కరీంనగర్ జిల్లా పార్లమెంట్ సభ్యుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు వేలిచాల రాజేందర్ రావు తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు మల్యాల మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్ లో బిజెపి మండల శాఖ అధ్యక్షుడు నేరెళ్ల శ్రవణ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బిజెపి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ తల్లిదండ్రుల పేరు చెప్పుకొని రాజకీయాలకు రాలేదని తన సొంత కాళ్లపై ప్రజల్లో ఉన్న అనుబంధంతో పైకి వచ్చారని పేర్కొన్నారు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల పైన కనీస అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు ఇప్పటికే పురోగతిలో ఉన్న పనులను కూడా మంజూరు చేయాలంటూ మాట్లాడడం విడ్డూరమన్నారు మనోహరాబాద్ నుంచి సిద్దిపేటకు రైల్వే లైన్ పూర్తయి ప్యాసింజర్ గూడ్స్ రైలు నడుస్తున్నాయని సిద్దిపేట నుంచి సిరిసిల్ల కరీంనగర్ వరకు ఉన్న 75 కిలోమీటర్ల రైల్వే లైన్ కు ఎర్త్ వర్క్ శరవేగంగా నడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 250 ఎకరాల భూమి రైల్వే పనులకు తన వాటా ధనాన్ని చెల్లించాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చినట్లయితే 18 నెలల్లో సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ కు రైలు కూత వేపిస్తామని ఆయన చాలెంజ్ చేశారు కొండగట్టు పుణ్యక్షేత్రానికి ఇప్పటికే రైల్వే లైన్ ఉన్నదని జగిత్యాల నుంచి కొండగట్టు మీదుగా నాలుగు వరసల జాతీయ రహదారి కూడా మంజురై భూసేకరణ టెండర్లు జరుగుతున్న విషయం రాజేందర్ రావు కి తెలియకపోవడం శోచనీయమని ఆయన ఎద్దేవా చేశారు 60 సంవత్సరాలుగా దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ హయాంలో మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ పూర్తి చేయలేదని, కొండగట్టుకు జాతీయ రహదారి నిర్మించ లేకపోయారని
కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల్లో చేయలేని పనిని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరు సంవత్సరాల్లో చేసి చూపించారని దద్దమ్మ ఎవరో దమ్మున్న నాయకుడు ఎవరో రాజేందర్ రావు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు 30 సంవత్సరాలుగా వరుసగా ప్రజాప్రతినిధిగా అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా కౌన్సిలర్ గా కార్పొరేటర్ గా రెండుసార్లు ఎంపీగా నిరంతరాయంగా గెలుస్తున్న బండి సంజయ్ కుమార్ దమ్మున్న నాయకుడని
ఏ పార్టీకి గుర్తు పైన నిలబడ్డప్పటికీ ప్రతిసారి ఓడిపోయిన వ్యక్తి వెలిశాల రాజేందర్ రావు అని ఆయన దుయ్యబట్టారు జూదశాలలు పానశాలలు క్లబ్బులు పబ్బులు నడిపిన రాజేందర్ రావు కి నియోజకవర్గ విషయాలపై కనీస అవగాహన లేదని రుజువు చేసుకున్నారని
6000 కోట్లతో జగిత్యాల నుంచి ఖమ్మం వరకు జాతీయ రహదారి నెంబర్ 5 6 3,
6500 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం, 1100 కోట్ల విలువైన హసన్పర్తి కరీంనగర్ రైల్వే లైన్ నిర్మాణం కొరకు ఫైనల్ లొకేషన్స్ సర్వే
కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం ఏటా 100 కోట్లు వందల కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రధానమంత్రి సడక్ యోజన మండల కేంద్రం నుంచి మండల కేంద్రానికి డబుల్ రోడ్ల నిర్మాణం కు నిధులు అత్యధికంగా మంజూరు చేయించిన ఘనత బండి సంజయ్ కుమార్ దని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
నూతనంగా మాల్కజ్ గిరి నుంచి భద్రాద్రి రామయ్య పాదాల చెంతకు రైల్వే లైన్ మంజూరు చేపిస్తే ఉడుక్కొని బండి సంజయ్ కుమార్ పై ఆరోపణలు చేయడం తగదన్నారు ఈ సమావేశంలో బిజెపి నాయకులు గుండె వెంకటేష్, మల్యాల మండల బిజెపి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version