*మా మెజారిటీ బహుజనుల జాతి అస్తిత్వపు ఆకాంక్ష అతడు – తీన్మార్ మల్లన్న*
ప్రశ్న ఆయుధం హైదరాబాద్ :
మూగబోయిన గొంతుకులకు తానే ఒక ధిక్కారస్వరంగా వినిపిస్తున్నాడు. తెలంగాణ అస్తిత్వపు కాగడను రగిలిస్తూనే ఉన్నాడు. అనునిత్యం అస్తిత్వం లేని జాతుల పక్షాన నిలబడ్డట్టు నటిస్తూ, అధికార కాంక్షకు రుచి మరిగిన అగ్రవర్గాల కుట్రలను సైతం ప్రజా క్షేత్రంలో ఎండగడుతున్నాడు. ఒకవైపు ప్రజాప్రతినిధిగా మరోవైపు, తన జాతి తాలూకు ప్రతిరూపంలా ఈ తెలంగాణ పౌర సమాజంలో రాజకీయాల ప్రత్యామ్నాయం అవుతున్నాడు. అగ్రవర్గ ఆధిపత్య దొరల ఆలోచన నుంచి వచ్చిన వారసత్వపు అధికార కాంక్షతో మనల్ని వెనుకకు నెట్టే అగ్రవర్ణాల ప్రతిబింబాలే నేటి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాలు. వాటి గురించి జర ఆలోచించండి.
బీసీ సమాజమా ఆలోచించు. అస్తిత్వం లేని జాతి నుండి అధికారం వైపు అడుగులు వేస్తున్న మన జాతి ధిక్కారస్వరం అయిన తీన్మార్ మల్లన్నను కాపాడుకోవడం నీ బాధ్యత. ఎందుకంటే నాడు ఆధిపత్య వర్గాల పీటలు కదిలేలా పోరాటం చేసిన మారోజు వీరన్న, కోనపురి సాంబశివుడు, బెల్లి లలిత అక్క ఇలా చెప్పుకుంటూ పోతే అగ్రవర్గ ఆధిపత్యాన్ని అణిచివేయడానికి ప్రతిఘటన ప్రతిరూపాలే వీర కిషోరాలై తిరగబడ్డారు. కానీ (చరిత్ర మనల్ని మరోలా మలిచింది) వాళ్ల పోరాటం ఈ ఆధిపత్య కులాల అధికార అస్తిత్వాన్ని హస్తగతం చేసుకోవడం కోసం , ఓ బీసీ పౌర సమాజమా నీ జాతి తాలూకు ధిక్కారస్వరాన్ని కాపాడుకో.మరో మల్లన్నను తయారు చేయాలంటే మన పౌర సమాజానికి మరో పాతికేళ్లు పడుతుంది. ఒకసారి ఆలోచించండి, అధికారంలో ఉన్నవాడు 60 ఏళ్ల లక్ష్యంతో ఆధిపత్యపు భావజాలాన్ని కొనసాగించడం కోసం చేస్తున్న ఈ దోపిడిని ఎదురించాలి. మనలో ఒకడు మనందరి కోసం ఉదయించిన మన జాతి తాలూకు అస్తిత్వమై ప్రతిఘటించిన ప్రతిరూపమే తీన్మార్ మల్లన్న. బీసీ పౌర సమాజం ఆలోచన చేయు, మీ అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న వ్యక్తిని కాపాడుకుంటావో లేదా కాలగర్భంలో కలిసిపోయే చరిత్ర లాగా వదిలేస్తావో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది…..
*బీసీలు అభివృద్ధి చెందనిదే దేశం అభివృద్ధి చెందదు..*
నూటికి 60 శాతం ఉన్న మనం నేటికీ అధికారానికి అస్తిత్వానికి దూరంగానే ఉన్న అమాయకకు జాతులు మనవి.మోసపోతున్నాం మనం మోసపోతున్నాం. మొదటి నుంచే మోసపోతున్నాం..
అధికారకాంక్ష కోసం ఆలోచన లేని అవిచ్ఛిన్నమైన అణగారిన వర్గాల తాలూకు ప్రతిరూపాలు మనం
స్వతంత్రంగా బతికే స్వేచ్ఛ నుంచి సంకోచిస్తూ సంఘర్షణ చేస్తూ ఈ సమాజంలో నేటికీ వెనుకకి నెట్టేయబడిన జాతులు మనవి.
ఈ అగ్రవర్ణ ఆధిపత్య కబంద హస్తాలలో మోసపోతున్నాం.
నాటి కమండల్ నేటి నయా కమాండల్ EWS వీలునామా రాసి విర్రవీగుతున్న అధికార కాంక్షకు మరిగిన ఆధిపత్య వర్గాల చేతులలో మనం మోసపోతున్నాం. నాడు కేంద్రంలో, నేడు రాష్ట్రంలో
ప్రతిఘటించలేని సమాజమా నీ ఉనికి మరల మోసపోతుంది. నిలువునా మోసపోతుంది. నీరుగారే చర్యలు ఎన్ని చేసినా నిటారుగా నిలబడిన ఈ కాగడను కబంద హస్తాల నుండి రక్షించుకో.
మండల్ ఉద్యమాన్ని మరలా తీసుకువద్దం. మనమంతా ఒకటే అని మరో బీసీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడదాం.ఇప్పుడు కావాల్సింది రాజ్యాధికారం కాదు, నీ అస్థిత్వాన్ని నిలుపుకోవడం.అస్తిత్వం కోసం పోరాటం ఒకవైపు అధికార ఆకాంక్ష కోసం పోరాటం మరోవైపు. అస్తిత్వం గెలుస్తుందో అధికారం నిలోస్తుందో చూద్దాం.
రాజ్యాన్ని గౌరవిద్దాం మనమంతా మన అస్తిత్వాన్ని ఈ రాజ్యానికి తెలిసేలాగా ప్రతిఘటిద్దాం…
*శ్రీకాంత్ కురుమ*
*మాస్టర్ ఆఫ్ కామర్స్*
*గ్రామం:- ముర్కుంజల్*
*మండలం:- కంగ్టి జిల్లా :- సంగారెడ్డి*
*సెల్ :- 8886916260*