హత్య కేసులో ప్రధాన నిందితుడు ఈయన ఒక విలేకరీ నా…!
కనీసం 10 పరీక్షలు జరుగుతున్నాయని తెలిసి వార్త రాసి జైలుకు వెళ్లిన వైనం
అక్రమార్కులకు అండగా నిలుస్తూ పరోక్షంగా వార్తలు…
ప్రశ్న ఆయుధం 29 ఆగస్ట్ (కామారెడ్డి ప్రతినిధి)
అతను సీనియర్ విలేకరి అంటూ ఏకంగా రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చిన ఘనత అతనిది. అలాంటి వ్యక్తి వార్తలు రాయడమా సిగ్గు సిగ్గు అంటూ పలువురు విమర్శిస్తున్నారు. అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ వార్తలు రాయడం అతని నైజమా. పది పరీక్షలు జరుగుతుంటే కనీసం వార్త రాయవద్దని అవగాహన సైతం లేకుండా జైలుకు వెళ్లి రావడం, గతంలో హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉంటూ జైలుకు వెళ్లిన ఘనత ఆయనది. అలాంటి వ్యక్తులకు పలువురు వత్తాసు పలుకుతూ తోటి విలేకరులపై వార్తలు రాస్తూ అక్రమార్కులు దందాలు చేస్తుంటే వారికి పరోక్షంగా తమ మద్దతు తెలుపుతున్నారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలపై వార్తలు రాయాల్సింది వదిలి, పరోక్షంగా అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ తెరవెనుక తమ దందాను కొనసాగిస్తున్నారని సమాచారం. ఇతను వార్తలు రాసేటప్పుడు ఏకంగా కల్లు సేవించి ఆ మత్తులో వార్తలు రాస్తున్నారని తెలుస్తుంది. ఆ మత్తులో ఏం వార్తలు రాస్తున్నారో తెలియడం లేదని తర్వాత తెలిసినా అతను సరిదిద్దుకోలేకపోతున్నారని సమాచారం. హత్య కేసులో ఒకసారి, పేపర్ లీకేజీ వార్త రాసి రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చిన ఘన చరిత్ర ఆ పాత్రికేయునిది. గతంలో రాత్రి వేళలో ఓ రైస్ మిల్ కు వెళ్లి అతని వద్ద ఏకంగా కారు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఘనత ఆ పాత్రికేయునిది. వార్తల్లో సత్య పూస పలుకులు పలుకుతూ తెర వెనుక అతని బాగోతం అందరికీ ఎరుకే.
మరికొందరి తొత్తులు ఇతనికి తోడు….
ఇతనికి తోడుగా మరో కొందరు తొత్తులు జమాయి ఇటీవల ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద ఏకంగా లక్ష రూపాయలు డిమాండ్ చేసి తీసుకోవడం సర్వత్ర చర్చనీయాంశంగా మారుతుంది. ప్రైవేటు పాఠశాలల్లో పరోక్షంగా బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ, దొంగ దొంగనే …. దొంగ దొంగ అన్నట్లుగా వ్యవహరించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే సరైన రీతిలో బుద్ధి చెబుతామని పలువురు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.