కనిపెంచితే కాదంటున్నాడు..!
పెరిగి పెద్దయి తండ్రి గుండెల పై తన్నుతున్నాడు
ఆస్తి మొత్తం కాజేసి, తండ్రిని ఇంటి నుండి వెళ్లగొట్టిన వైనం..
చేసేది లేక పోలీసులను ఆశ్రయించిన వృద్ధుడు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఘటన
కనిపెంచిన కన్న తండ్రిని ప్రబుద్ధుడు ఇప్పుడు కాదంటున్నాడు తల్లి నవమాసాలు మోసి పెంచితే తండ్రి పెరిగి పెద్దయి ప్రయోజకుడు అయ్యేవరకు తన భుజస్కందాలపై పెట్టుకుని ముందుకు నడిపిస్తారు అలాంటి తండ్రిని ఆస్తి మొత్తం కాజేసిన తర్వాత తన బాగోవులు చూడనంటూ ఇంట్లో నుండి బయటకు వెళ్లగొట్టాడు చివరకు తన నానమ్మ మృతి చెంది అంత్యక్రియలు చేసేందుకు కూడా ఇంట్లోకి రానివ్వకుండా తన కర్కశాన్ని చూసి ఇంటి ముందు నుండే కార్యక్రమాలను చేసుకు వెళ్లాలని బెదిరింపు చర్యలకు పాల్పడ్డాడు దీంతో చేసేదేమీ లేక మూడు సంవత్సరాల క్షోభ అనుభవించి ప్రస్తుతం ఆ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు..
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని దమ్మన్నపేట శివారు దొడ్లగడ్డ గ్రామానికి చెందిన గుజ్జుల రాజిరెడ్డి అనే వృద్ధుడు తన కుమారుడు గుజ్జుల వినయ్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
దమ్మన్నపేట శివారు దొడ్లగడ్డ గ్రామానికి చెందిన రాజిరెడ్డి 33 సంవత్సరాల క్రితం మైలారం గ్రామానికి చెందిన సుజాతను వివాహం చేసుకున్నాడు వారి ఇరువురి దాంపత్య జీవితంలో ఓ కుమార్తె కుమారుడు వినయ్ రెడ్డి జన్మించారు అనంతరం ఐదు సంవత్సరాల తర్వాత రాజిరెడ్డి అదే గ్రామానికి చెందిన మరో మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ ప్రేమ వివాహం సైతం మొదటి భార్య సుజాతను ఒప్పించే పెళ్లి చేసుకుని దాదాపు అందరూ కలిసి 25 సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో సంసార జీవితాన్ని గడిపారు. రెండో వివాహం చేసుకున్న యశోదకు సైతం ఓ కుమార్తె జన్మించింది.ఈ రకంగా అందరు అన్యోన్యంగా ఉంటూ పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ వినయ్ రెడ్డి పెరిగి పెద్దయ్యాక తన తండ్రి పట్ల కర్కషత్వాన్ని ప్రదర్శించాడు. రాజిరెడ్డికి తన తాతల కాలం నుండి వస్తున్న దాదాపు 15 ఎకరాల భూమిని కాజయాలని తన తల్లి సుజాతతో కలిసి పక్కా ప్లాన్ రచించాడు. ఈ మేరకు పెద్ద కుమార్తె శ్రావణి పెండ్లి పూర్తయిన తర్వాత నా తండ్రిని బెదిరించి చంపేస్తానని చెప్పి చెప్పినట్టు వినకపోతే చిన్న కుమార్తెను చిన్న భార్యను సైతం చంపేస్తానని బెదిరించాడు. భూమి మొత్తం తన పేరిట చేయాలని వేధింపులకు దిగాడు. దీంతో తన చిన్న భార్యకు తెలియకుండా కొడుకు చంపేస్తా అనడంతో భూమిని రిజిస్ట్రేషన్ చేశాడు. వినయ్ రెడ్డి పేరున భూమి కాగానే రాజీరెడ్డిని , రాజీరెడ్డి తల్లి వనమ్మను రెండో భార్యను యశోదను, కుమార్తెను ఇంట్లో నుండి 2022 లో బయటకు పంపించాడు. కొడుకు భయంతో ఎన్ని రోజులపాటు భయపడిన ఆ తండ్రి , తన తల్లి అంత్యక్రియల కోసం రెండు నెలల క్రితం ఇంటికి వెళితే అవమానించి ఇంట్లో శవాన్ని వేయనీయకుండా బయట నుండే కార్యక్రమాలు చేయడంపై రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. చుట్టుప్రక్కల ప్రజలు అందరూ వచ్చి నచ్చ చెప్పిన తర్వాత కార్యక్రమాలు చేసుకున్నారు కానీ ఇంట్లోకి మాత్రం రానివ్వలేదు దీంతో మదనపడిన రాజిరెడ్డి ఎలాగైనా తన కుమారుడికి బుద్ధి చెప్పారని నిర్ణయించుకున్నాడు ఈ మేరకు వర్ధన్నపేట పోలీసులను వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించాడు సీనియర్ సిటిజన్ ఆక్ట్ 2005 రెవెన్యూ చట్టం ప్రకారం తన బాగోవులు తన భార్య బాగోగులు చూసుకొని తన కుమారుడు వినయ్ రెడ్డి పట్ల చర్యలు తీసుకోవాలని తనను బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి పట్టా పాస్బుక్ రద్దుచేసి తనపై చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు కుమారుడి పట్ల రక్షణ కల్పించాలని ఇటు పోలీసులను తనకు రెవెన్యూ చట్టం ప్రకారం తన భూమి తనకు చెందాలని వినతి పత్రాలు అందజేశాడు. తన తదనంతరం చట్ట ప్రకారం తన వారసులకు తన కుటుంబ సభ్యులకు ఈ భూమి చెందాలని అక్రమంగా బెదిరించి ఎక్కించుకున్న భూమిని అందరికీ చెందేలా చూడాలని కోరుతున్నాడు.