మెదక్/నర్సాపూర్, డిసెంబరు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న సాయికుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొల్చారం పోలీస్ స్టేషన్ ఆవరణలో చెట్టుకు హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడగా.. సిబ్బంది గమనించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ సందర్శించారు. వెంటనే కొల్చారం పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.