హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలి

హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలి

-జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 28, కామారెడ్డి :

హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వైద్య సిబ్బందిని ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి మండలంలోని గర్గుల్ పల్లె దవాఖాన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ఆకస్మికంగా సందర్శించారు.
పల్లె దవాఖాన ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరంలో గల ఓపి, రక్త పరీక్షల ల్యాబ్ మరియు ఫార్మసీ సంబంధించిన వాటిని తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలలో పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది హాజరు వివరాలపై వాకబు చేసి ప్రస్తుత వర్షాల నేపథ్యంలో ప్రజలపై సీజనల్ వ్యాధులు ప్రభావం అధికంగా చూపుతాయని జ్వర పీడిత సర్వే పగడ్బందీగా నిర్వహించి సీజనల్ వ్యాధులపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. వైద్యాధికారులు, ఎం ఎల్ హెచ్ పి, ఏఎన్ఎం, ఆశాలు ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని మరియు వైద్య సిబ్బంది హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now