పచ్చి అరటికాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

అరటికాయలతో
Headlines in Telugu
  1. పచ్చి అరటికాయలతో షుగర్ లెవెల్స్ నియంత్రణ ఎలా?
  2. జీర్ణవ్యవస్థ మెరుగుదలలో పచ్చి అరటికాయల పాత్ర
  3. బరువు తగ్గడానికి పచ్చి అరటికాయలు ఎంతగానో ఉపయోగపడతాయి
  4. నాడీ వ్యవస్థకు పచ్చి అరటికాయల పొటాషియం మేలును తెలుసుకోండి
  5. పచ్చి అరటికాయలు ఎముకల బలం కోసం సహజంగా ఉపయోగపడతాయి

పసుపు అరటి పండ్లు కంటే పచ్చి అరటికాయలతోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి అరటికాయలు పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

*ఆరోగ్య ప్రయోజనాలు….*

1.పచ్చి అరటికాయలో చెక్కర స్థాయి తక్కువ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.

2.అరటికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఆరోగ్యం మొత్తం మెరుగుపడుతుంది. పచ్చిఅరటిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.

3.రోజుకు 3.6 గ్రాముల ఉడికించిన అరటికాయ తినడం వల్ల జీర్ణవ్యవస్థకు అవసరమయ్యే ఫైబర్ పొందవచ్చు.

4.పచ్చి అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది నాడీవ్యవస్థను చురుగ్గాపనిచేయడానికి సహాయపడుతుంది.

5.పచ్చి అరటిపండ్లు తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల తరచుగా తినాలనే ఫీలింగ్ తగ్గుతుంది. దీనివల్ల బరువు పెరగడం, ఇతర అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

6.పచ్చి అరటిపండ్లలో విటమిన్స్, మెగ్నీషియం, క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు స్ట్రాంగ్‌గా మారుతాయి. అలాగే కీళ్ల నొప్పులను కూడా నివారిస్తాయి. 

 

Join WhatsApp

Join Now