ఆరోగ్యమే మహాభాగ్యం – ఫిట్ నెస్ టీమ్

ఆరోగ్యమే మహాభాగ్యం : ఫిట్ నెస్ టీమ్

ఆరోగ్యమే మహాభాగ్యమని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఫిట్నెస్ టీమ్ సభ్యులు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డ్ హౌసింగ్ బోర్డు కాలనీ క్రీడా ప్రాంగణం వద్ద గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఫిట్నెస్ టీమ్ సభ్యులు రాజు, రామ్ మోహన్, రఘుపతి, రామచంద్రం మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని దాదాపు 5 సంవత్సరాల క్రితం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కు చెందిన మిత్రులం ఫిట్నెస్ టీమ్ గా ఏర్పాటై ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు నడక వ్యాయామం అనంతరం వాలీబాల్ ఆడడం జరుగుతుందని, ఫిట్నెస్ టీమ్ లో చేరిన తర్వాత మా అందరి ఆరోగ్యాలు బాగుంటున్నాయని, ఎంత ఆస్తి ఉన్న ఆరోగ్యం బాగా లేకుంటే అంతా వృధా అని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని, వ్యాయామం వల్ల ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. మా ఫిట్నెస్ టీమ్ సభ్యుల ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వివిధ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు ఇవ్వడంతో పాటు, నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిట్నెస్ టీమ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ హరికృష్ణ గౌడ్, కన్న యాదవ్,సాయి, దుర్గ,మహేష్,ఉపేందర్, లింగం,సంతోష్, సంతోష్, శ్రీనివాస్ రెడ్డి, గిరి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now