కూకట్పల్లిలోని సర్దార్ పటేల్ నగర్ లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. యశోద హాస్పిటల్ (హైటెక్ సిటీ) సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 350 మందికి పైగా ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.
టిపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. సామాజిక బాధ్యతగా సమాజానికి సేవ చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు మండల సాయిబాబ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, తగు సూచనలు, సలహాలు అందించారు.
వైద్య పరీక్షలు సకాలంలో చేయించుకోవడం ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించి నివారించవచ్చని బండి రమేష్ అన్నారు. ఇది ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యశోద హాస్పిటల్ వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని సేవలు అందించింది.











