పొలం పనులు చేస్తుండగా గుండెపోటు.. 

పొలం పనులు చేస్తుండగా గుండెపోటు..

నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి డిసెంబర్ 29

ఆర్మూరు మండలం:వ్యవసాయ కూలీ మృతి…వ్యవసాయ క్షేత్రంలో పొలం పనులు చేస్తుండగా దత్తారావు(43) అనే వ్యవసాయ కూలీ గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. ఆర్మూర్ మండలం మిర్దాపల్లికి చెందిన నారాయణ వద్ద బోధన్ మండలం కల్దుర్తికి చెందిన దత్తారావు కూలీ పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఆదివారం దత్తారావు పొలంగట్టుపై పనిచేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మృతుడి భార్య భూమాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Join WhatsApp

Join Now