Site icon PRASHNA AYUDHAM

విశాఖలో భారీ డ్రగ్స్ పట్టివేత

Picsart 25 07 06 22 23 34 326

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

విశాఖలో భారీ డ్రగ్స్ పట్టివేత

విశాఖపట్నం: విశాఖలో పోలీసులు భారీగా కొకెయిన్ స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ రోడ్ వద్ద పోలీసు బృందం తనిఖీలు నిర్వహించి, సౌత్ ఆఫ్రికాకు చెందిన థామస్ డ్జిమోన్, విశాఖకు చెందిన అక్షయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 25 గ్రాముల కొకెయిన్, ఒక కార్, ₹3.6 లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్లు, ఒక డైరీ స్వాధీనం చేసుకున్నారు.

 

అధికారుల వివరాల ప్రకారం, ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి అక్షయ్‌కు అందిస్తున్న సమయంలో ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయి. స్వాధీనం చేసిన కొకెయిన్ విలువ సుమారుగా ₹10–15 లక్షలుగా అంచనా. అక్షయ్‌ను విచారించగా, ఢిల్లీలోని కొంతమంది సంపర్కాల వివరాలు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.

 

వీరి కోసం ప్రత్యేక బృందాలను ఢిల్లీకి పంపామని, డ్రగ్స్ రాకెట్‌పై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని విశాఖ సీపీ శంఖ బ్రాత్ బాగ్చి తెలిపారు.

Exit mobile version