కందకుర్తి గోదావరిలో భారీ వరద ఉధృతి

 

ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదలపై కందకుర్తి బ్రిడ్జి పర్యవేక్షణ చేసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్

– ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

నిజామాబాద్, సెప్టెంబర్ 26 (ప్రశ్న ఆయుధం):

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా గోదావరిలోకి వరద నీరు భారీగా వచ్చిపోతుండటంతో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామ సమీపంలో గల గోదావరి బ్రిడ్జిపై వరద ప్రవాహం తీవ్రంగా పెరిగింది. ఈ నేపథ్యంలో నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. స్వయంగా కందకుర్తి బ్రిడ్జిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి నదిలో ప్రవాహం తీవ్రమై ఉండటంతో ఎవరూ నీటి ఒడ్డు వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు.

అత్యవసర పరిస్థితులలో ప్రజలు రెంజల్ పోలీస్ స్టేషన్, డయల్ 100, లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712659700 ద్వారా సహాయం కోరాలని సూచించారు.

ఈ పర్యటనలో బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ ఎస్. సంతోష్ రెడ్డి, రెంజల్ ఎస్ఐ కె. చంద్ర మోహన్, ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now