బాన్సువాడ లో దంచి కొడుతున్న భారీ వర్షం

బాన్సువాడ లో దంచి కొడుతున్న భారీ వర్షం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

నష్టాల్లో వ్యాపారులు,రైతన్నలు

ప్రశ్న ఆయుధం 22 మే ( బాన్సువాడ ప్రతినిధి)

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి.దీంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.చిన్న తరహా వ్యాపారులకు నష్టం వాటిల్లింది.మే నెలలో ఇలాంటి భారీ వర్షాలు గత పది సంవత్సరాలలో ఎప్పుడు పడలేదని వరుణ దేవుడు కణికరించాలని దేవున్ని వేడుకుంటున్నారు ప్రజలు.కొన్నిచోట్ల వరిధాన్యం కొనుగోలు చేయలేదని వర్షంలో తడిసి ముద్దాయి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment