*ములుగు, జనగామ, ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.
జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో భారీ వడగండ్ల వాన కురిసింది, జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది కొంత ధాన్యం వరదలో కొట్టుకుపోయింది.
జనగామ, లింగాల, గణపురం,రఘునాధపల్లి, మండలంలో కురిసిన వర్షానికి పంట నేల రాలింది. పలుచోట్ల రహదారులపై చెట్లు నేలకుడిగాయి అకాల వర్షం రైతులను నిండా ముంచిం దని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తడిసిన ధాన్యాన్నిమాయిశ్రర్ లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా ఉరుములు మెరుపులు ఈదుల గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది దీంతో అన్నదాతలు దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోయిన ధాన్యం రాశులపై టార్పిన్ పదాలు కప్పి తడవకుండా దాన్యం ధాన్యం రాశులు కాపాడుకునే ప్రయత్నం చేశారు.