భారీ వర్షానికి ఉప్పొంగిన చెరువులు – రహదారులపై వరద బీభత్సం

భారీ వర్షానికి ఉప్పొంగిన చెరువులు – రహదారులపై వరద బీభత్సం

బాన్స్వాడ–పిట్లం రహదారి పై నీటి ప్రవాహం తీవ్రంగా

సిద్దపూర్–చిల్లర్గీ రహదారి పై నిలిచిన వరద నీరు

సిద్దపూర్ గ్రామ ఎస్సీ కాలనీలోకి చేరిన నీరు

స్థలాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ కిరణ్మాయి

చిన్న బ్రిడ్జ్ నిర్మించాలంటూ గ్రామస్తుల విజ్ఞప్తి

ప్రశ్న ఆయుధం న్యూస్ – జుక్కల్ నియోజకవర్గం, ఆగస్ట్ 28

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం సిద్దపూర్ పరిధిలో వరద బీభత్సం చోటుచేసుకుంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పైప్రాంతం చెరువులు ఉప్పొంగి గోలుసు కట్టు చెరువుల నుండి ఒకేసారి నీరు చేరడంతో పిట్లం–బాన్స్వాడ ప్రధాన రహదారిపై ఉన్న చిన్న కాల్వర్ట్ నీరుతట్టుకోలేకపోయింది. దీంతో రోడ్డు మీదగానే వరద ప్రవహించి, రాకపోకలకు అంతరాయం కలిగింది.చిల్లర్గీకి వెళ్లే రహదారి పై నీరు నిలవడంతో గ్రామస్తులు ఇరుక్కుపోయారు. అంతేకాకుండా సిద్దపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి వరద నీరు చేరింది. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మాయి శుక్రవారం సిద్దపూర్ చేరుకొని స్థితిగతులు పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి, నీరు చేరిన కుటుంబాలను తాత్కాలిక పునరావాస కేంద్రం రాంపూర్ పాఠశాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.గ్రామస్తులు హైవే రోడ్డులో సరైన బ్రిడ్జ్ లేకపోవడం వల్లే వరద రహదారిపైకి దూసుకొస్తోందని సబ్ కలెక్టర్‌కు వివరించారు. దానికి స్పందించిన కిరణ్మాయి, సమస్య పరిష్కారం కోసం సంబంధిత ఆర్&బి అధికారులతో చర్చించి చిన్న బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. వరద ముప్పు కారణంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు, పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆమె సూచించారు.ఈ పరిశీలనలో ఏమర్వో, రాజనరేందర్ గౌడ్, ఎంపీడీవో రఘు, ఎస్సై వెంకట్రావు, ఎంపీవో నాగరాజు, ఆర్ఐ షీతల్, ఇరిగేషన్ ఏఈ నవీన్, ఆర్&బి జయరావ్, పంచాయతీ సెక్రటరీలు వినోద్ పటేల్, సమద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment