ఆంధ్రప్రదేశ్ : రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. శుక్రవారం సహా మూడు రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రాంతాల్లో గాలులు వీయవచ్చునని హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గో, ప.గో, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అల్లూరి, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురవనున్నట్లు తెలిపింది.