సెప్టెంబరు నెలల్లో సంభవించిన భారీ వర్షాలు..

అమరావతి ఏపీలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సంభవించిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) నిర్దేశించిన మొత్తం కంటే ఆర్థిక సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిర్దేశించిన మొత్తం కంటే అదనంగా ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా స్కేల్ ఆఫ్‌ ఫైనాన్స్‌ను మార్చుతూ రెవెన్యూశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 17న సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు అనుగుణంగా వరద ముంపు బాధితులకు సాయం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

179 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఇళ్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిర్దేశించిన రూ.11 వేలకు బదులుగా రూ.25వేల ఆర్థిక సాయం చేయనున్నారు. మొదటి ఫ్లోర్‌లో ఉన్న ముంపు బాధితులకు రూ.10 వేలు, వరదలకు ధ్వంసమైన దుకాణాలకు రూ.25వేలు, వ్యవసాయ పంటలకు హెక్టారుకు రూ.25వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. వరదలు, వర్షాల కారణంగా ఇళ్లు ధ్వంసమైన వారికి కూడా గృహ నిర్మాణ పథకాల కింద ఇంటిని నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.

Join WhatsApp

Join Now