నేడు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ : తుపాన్ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు నెల్లూరు, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు.