*_భారీ వర్షాలు… స్కూళ్లకు కొనసాగుతున్న సెలవులు..!!_*
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా రాష్ట్రంలో రేపు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
అతిభారీ వర్షాల నేపథ్యంలో సిద్ధిపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అవసరమైతే కలెక్టర్లు నిర్ణయం తీసుకొని స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని తెలపగా.. వాతారవరణ శాఖ సూచన మేరకు జిల్లా కలెక్టర్లు స్కూళ్లకు హాలిడేస్ ఇస్తున్నారు. మరోవైపు ఏపీలో కూడా కుండపోత వానలు పడే అవకాశం ఉన్నందున మన్యం జిల్లాలోని పాఠశాలలకు రేపు సెలవు ఇచ్చారు.