Site icon PRASHNA AYUDHAM

నేడు, రేపు భారీ వర్షాలు..!!

IMG 20250721 WA1999

నేడు, రేపు భారీ వర్షాలు..!!

_2 రోజులు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ_

హైదరాబాద్‌, జూలై 21 రాష్ట్రం లో సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

రెండు రోజుల పాటు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని పేర్కొంది.

ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఇక సిరిసిల్ల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగి రి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Exit mobile version