Site icon PRASHNA AYUDHAM

-రిజిస్ట్రార్ ఆఫీసులో భారీ చోరీ.. రూ.13 లక్షల స్టాంపు పేపర్లు మాయం

IMG 20250704 WA0426

గన్నవరం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు ఏకంగా రూ.13.56 లక్షల విలువైన నాన్-జ్యుడీషియల్ స్టాంపు పేపర్లను అపహరించుకుపోయారు. అధికారులు ఈ ఘటనపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, చోరీకి గురైన స్టాంపు పేపర్లను ఎవరూ కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు.

వివరాల్లోకి వెళితే… బుధవారం విధులు ముగిసిన తర్వాత సిబ్బంది కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లారు. గురువారం ఉదయం కార్యాలయం తెరిచేందుకు రాగా, ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బయటి గదిలోని బీరువాను పగలగొట్టి అందులో ఉన్న స్టాంపు పేపర్ల బండిళ్లను దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దొంగలు చాలా పక్కా ప్రణాళికతో ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. వేలిముద్రలు దొరకకుండా గ్లోవ్స్ ధరించి, పని పూర్తియ్యాక వాటిని

Exit mobile version