హలో లంబాడా! చలో గాంధారి!!

హలో లంబాడా! చలో గాంధారి!!

 

– మన హక్కుల కోసం మనం పోరాడుదాం

 

– లంబాడి హక్కుల పోరాట సమితి యూత్ రాష్ట్ర అధ్యక్షులు

 

కామారెడ్డి జిల్లా గాంధారి

(ప్రశ్న ఆయుధం) జులై 20

 

ఈనెల 27 నా గాంధారి గిరిజన గర్జన సభను విజయవంతం చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి యూత్ రాష్ట్ర అధ్యక్షులు ధరావత్ మోతిలాల్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ

ప్రధానమైన ఎజెండా అంశాలు గోర్ ధర్మ సమాజ్ పరిరక్షణ, రాజ్యాంగంలో 8 షెడ్యూల్లో గోర్ బోలి భాషను చేర్చాలి, పోడు భూములు , అసైన్ ల్యాండ్ సమస్యలను పరిష్కరించాలని, గిరిజనులకు వచ్చే సబ్సిడీ పైన తదితర వివిధ అంశాలపై గాంధారిలో భారీ గిరిజన గర్జన సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఉన్న లంబాడ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గణేష్ నాయక్, ప్రధాన కార్యదర్శి బద్రి నాయక్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవి నాయక్, గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, టౌన్ అధ్యక్షులు మోహన్ నాయక్, విద్యార్థి సంఘం అధ్యక్షులు ప్రకాష్ నాయక్, కామారెడ్డి రూరల్ అధ్యక్షులు గోపి నాయక్, రవి నాయక్, రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment