హలో మాదిగ లక్ష డప్పులతో చలో హైదరాబాద్ 

హలో మాదిగ లక్ష డప్పులతో చలో హైదరాబాద్

ప్రశ్న ఆయుధం హుజూర్ నగర్ నియోజక వర్గ ఇన్చార్జి జనవరి 06

హలో మాదిగ లక్ష డప్పులతో వెయ్యి గొంతుకలతో చలో హైదరాబాద్ కు తరలిరావాలని కళాకారుల కవాతు సంఘం జిల్లా ఇన్చార్జి కోట వీరస్వామి మాదిగా అన్నారు. మఠంపల్లి మండల కేంద్రంలో నియోజకవర్గ ఇన్చార్జి బచ్చలకూరి ప్రసాద్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఇరుగు ప్రభు వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా మాదిగ కళాకారుల సంఘం జిల్లా ఇన్చార్జి కోట వీరస్వామి మాదిగ విచ్చేసి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమంతో సామాజిక న్యాయంతో అలుపెరగని పోరాటం చేస్తూ ఎస్సీ మాదిగ మరియు ఉప మాదిగ కులాలకు విద్యా ఉద్యోగ అన్ని రంగాలలో భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని కులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లలో ఎవరి వాటా వారికి దక్కాలని నిరంతరంగా మందకృష్ణ మాదిగ వారి నాయకత్వంలో పోరాటం చేస్తే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ త్వరగా చేయాలని వెయ్యి గొంతుకుల లక్ష డప్పుల ప్రదర్శనను చలో హైదరాబాద్ ద్వారా మాదిగల మండే గుండెచప్పుడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అందుకు మాదిగలు మాదిగ కళాకారులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమ అనంతరం మండల మాదిగ కళాకారుల కమిటీ ఎన్నిక చేయడం జరిగింది. మాదిగ కళాకారుల మండల అధ్యక్షులుగా సత్తారపు శివ మాదిగ ఉపాధ్యక్షులుగా గుండె పంగు గోపి మాదిగ ప్రధాన కార్యదర్శిగా చడపంగు కృష్ణమాదిగ అధికార ప్రతినిధిగా బచ్చలకూరి నాగేష్ మాదిగ కోశాధికారిగా శాంతి కుమార్ మరియు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎం ఎస్ పి మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు చిన్నపంగు ఆదినారాయణ నందిపాటి సైదులు ఏలేటి జయరాజు కొమ్ము కరుణాకర్ కొమ్ము వీరబాబు గుండే పంగు నాగార్జున ఊబ్బేపల్లి శ్రీనివాస్ కొత్తపల్లి గణేష్ చిన్న పొంగు లాజరు కటికం కనకయ్య కొత్తపల్లి ప్రశాంత్ పాతకోటి వెంకటేశ్వర్లు ఇరుగు సన్ని నందిపాటి రాంబాబు అమరవరపు నరేష్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now