హలో మైరా…అదిగో పిచ్చుక
హలో మైరా… ఏం చేస్తున్నావ్ రా…. నానిని పిలువు….అదిగో పిచ్చుక… రమ్మను… రమ్మను అంటూ… తన మనుమరాలతో సరదాగా కాలక్షేపం చేశారు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…. నిత్యం బిజీ బిజీ గా గడిపే ఆయన నిన్న అశ్వారావుపేట నియోజకవర్గ పర్యటన ముగించుకొని సత్తుపల్లి నుంచి వైరా పర్యటనకు వెళ్తూ మార్గ మధ్యలో తన స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురంలో కాసేపు ఆగారు… అక్కడే ఉన్న తన మనవరాలు మైరాను ఎత్తుకుని ముచ్చట్లు చెప్పారు… ఏం అయింది అమ్మ అబ్బు అయిందా …. ఊచ్ పోదామా అంటూ పాప తో ఆడుకున్నారు. అనంతరం స్థానిక నాయకులతో కాసేపు ముచ్చటించారు.
ఖమ్మంజిల్లాకల్లూరులో