సంగారెడ్డి, అక్టోబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర వ్యాప్తంగా “హలో విద్యార్థి – చలో కలెక్టరేట్” పేరుతో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే గౌరవ చింతా ప్రభాకర్ ఆదేశానుసారం జరిగింది. అనంతరం విద్యార్థి ప్రతినిధులు డీఆర్ వో పద్మజా రాణికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు పెద్దగొల్ల శ్రీహరి మాట్లాడుతూ.. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్ల విద్యారంగంలో అనేక సమస్యలు తలెత్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్ చేసినా, విద్యా సంస్థల యాజమాన్యాల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మాత్రం వాయిదా వేస్తూ విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయకపోతే, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్ నాయక్, రాష్ట్ర విద్యార్థి విభాగ కార్యదర్శి మన్సూర్ అహ్మద్, అందోల్ అధ్యక్షుడు నాగరాజు, జహీరాబాద్ అధ్యక్షుడు రాకేష్, సదాశివపేట్ పట్టణ, కంది మండల అధ్యక్షుడు రోషన్, పాండు నాయక్, నగేష్, నాయకులు రాము, అఖిల్, అక్షయ్, శివ, సాయి, నాసర్, ప్రశాంత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హలో విద్యార్థి – చలో కలెక్టరేట్ ముట్టడి
Published On: October 29, 2025 9:52 pm