లక్కీ డ్రా ద్వారా హెల్మెట్లు, సైకిల్ పంపిణీ
నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 4:
గణేష్ చందా మిగిలిన డబ్బుతో సామాజిక సేవా కార్యక్రమం చేపట్టిన గాంధీ అసోసియేషన్ ప్రశంసనీయమని ధర్పల్లి ఎస్సై కళ్యాణి అభినందించారు.
డీబీ తాండాలో గాంధీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం అనంతరం మిగిలిన నిధులతో 10 హెల్మెట్లు, ఒక సైకిల్ కొనుగోలు చేశారు. వాటిని లక్కీ డ్రా ద్వారా తాండా ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కళ్యాణి స్వయంగా హెల్మెట్లు, సైకిల్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ —
“హెల్మెట్ వాడకం ప్రతి ఒక్కరి భద్రతకే కాదు, కుటుంబాల సురక్షితానికి కూడా అవసరం. గాంధీ అసోసియేషన్ చూపిన ఆలోచన ఆదర్శప్రాయమైనది” అని పేర్కొన్నారు. తాండా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలని సూచించారు.