వరద బాధితులకు నెస్లే, హాస్ సంస్థల నుంచి సహాయం
జీవధాన్ ఆసుపత్రి ఆవరణలో వెయ్యి కుటుంబాలకు రేషన్ కిట్లు పంపిణీ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 11
జిల్లా కేంద్రంలో గల జీవధాన్ ఆసుపత్రి ఆవరణలో మొన్నటి వరకు జరిగిన వరదలతో ఇబ్బందులు ఎదుర్కొన్న బాధిత కుటుంబాలకు నెస్లే కంపెనీ మరియు హైదరాబాదు ఆర్చ్ డయాసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ (HASS) సంస్థల ప్రతినిధులు సహాయ హస్తం అందించారు.
వారు కలిసి సుమారు వెయ్యి కుటుంబాలకు 14 రకాల నిత్యావసర వస్తువులతో కూడిన రేషన్ కిట్లను పంపిణీ చేశారు. నెస్లే కంపెనీ తరఫున ప్రతినిధి హాసీం పాల్గొనగా, HASS సంస్థ తరఫున ఎం.ఎం. రాజు, రవి, ప్రవీణ్ కుమార్ సహకరించారు. స్థానిక ప్రజలు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు.