వరద బాధితులను ఆదుకోవాలి జాతీయ విపత్తుగా ప్రకటించాలి 6000 కోట్లు కేటాయించాలి ఎర్రగుంటపాడు లో యానాదులందర్నీ వరద బాధితులుగా గుర్తించాలి పరిహారం ఇవ్వాలి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ ఇటీవల వచ్చిన తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలంగాణ గారు వేల కోట్ల రూపాయల కేటాయించాలని ఎకరానికి నష్టపరిహారం 30 వేల రూపాయలు ఇవ్వాలని ఎర్రగుంటపాడులో యానాదులందరినీ వరద బాధితులకు గుర్తించాలని సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోణంనేని సాంబశివరావు పాల్గొని మాట్లాడుతూ వరద బాధితులని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కనీసం పదివేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా వరద బాధితులు అందరిని గుర్తించాలని కొట్టం బాల వారి ఇల్లు లెక్క కాకుండా కుటుంబాలు వారికి గుర్తించాలని డిమాండ్ చేశారు ప్రతి ఎకరానికి 30 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ముఖ్యంగా ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్టం జరిగిందని నష్టపోయిన రైతాంగానే ఆదుకొని అష్టపరిహారం సకాలంలో చెల్లించి రైతుల ఆదుకోవాలని ఎర్రగుంటపాడు వరద బాధితులు అందరిని అష్టపరిహారం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు డిమాండ్ చేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అధ్యక్షతన సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ దండి సురేష్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.కె జానీ మియా ఏపూరి లతా దేవి కళావతి సిపిఐ మహిళా సమైక్య సత్తుపల్లి డివిజన్ నాయకులు ఎస్.కె రంజాన్ బి వై ఎఫ్ నాయకులు ఎస్కే హమీద్ అంజమ్మ సునీత వెంకన్న రాములమ్మ సుజాత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Latest News
