వయానాడ్ ప్రజలకు సీతక్క చేయూత.

వయానాడ్ ప్రజలకు సీతక్క చేయూత..!!!

వరద బాధితులకు రూ.20 లక్షల చెక్కును అందించిన మంత్రి..

IMG 20240825 WA0013

ప్రకృతి విలయానికి అతలాకుతలమైన కేరళలోని వాయనాడ్్లో తెలంగాణ మంత్రి సీతక్క శనివారం పర్యటించారు.ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్తో కలిసి ఆమె ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. కేరళ ప్రజలకు చేయూ తనందించారు. వరద బాధితుల సహాయార్ధం తాను సేకరించిన రూ.20 లక్షల చెక్కును స్థానిక ఎమ్మెల్యే టి సిద్ధికీకి అందించారు. దీంతోపాటు సుమారు పది లక్షల విలువ గల దుస్తులు, నిత్యావసర వస్తువులను స్థానిక నాయకులను అందజేశారు.వందల సంఖ్యలో సామూహిక ఖననం చేసిన ముండక్కై శ్మశాన వాటికలో మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడే మృతుల కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. ఈ సమయంలో మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం సీతక్క స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి కష్టం పగవాడికీ రావొద్దని అన్నారు. ఈ ప్రాంతాలను చూసి హృదయం ద్రవించిపోయిందన్నారు.వాయనాడ్్ ప్రజలకు నైతిక మద్దతు ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చానని చెప్పారు. 24 గంటలూ పనిచేస్తున్న రెస్క్యూ టీమ్లు, స్థానిక అధికారులు, వాలంటీర్ల అవిశ్రాంత ప్రయత్నాలను ఆమె అభినందించారు. విపత్తు వల్ల నష్టపోయిన వారి జీవితాలను పునర్నిర్మించడంలో సాధ్యమైనంత సహాయాన్ని అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

Join WhatsApp

Join Now