Site icon PRASHNA AYUDHAM

హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

IMG 20250314 WA0057

*హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు*

టాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో వేగంగా వచ్చిన ఓ కారు బాలయ్య ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. కారు మాదాపూర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-45 మీదుగా చెక్ పోస్ట్‌ వైపు వెళ్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

ఈ ఘ‌ట‌న‌లో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం ధ్వంసమయ్యాయి. అయితే, డ్రైవర్‌ అతివేగంతో పాటు నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

Exit mobile version