వీరుడా… నీ త్యాగం మర్చిపోలేనిది!!
భగత్ సింగ్ కి నివాళులు అర్పించిన యువనాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్..
దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన గొప్ప దేశ భక్తుడు భగత్ సింగ్ అని ఫౌండేషన్ కో – ఫౌండర్, బీఆర్ఎస్ యువ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ అన్నారు. భగత్ సింగ్ జయంతి సందర్భంగా పటాన్ చెరులోని ఫౌండేషన్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మాదిరి ప్రిథ్వీరాజ్ భగత్ సింగ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర పోరాటాన్ని ముందుకు నడిపించడంలో ఆయన చేసిన త్యాగం చాలా గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో చందు గారు,సంతోష్ గారు,ప్రెసిడెంట్ మధు. యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు..