సీఎం నివాసంలో హర్పాల్ సింగ్ మర్యాదపూర్వక భేటీ

సీఎం నివాసంలో హర్పాల్ సింగ్ మర్యాదపూర్వక భేటీ

జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి‌ను నీటి పారుదల సలహాదారు హర్పాల్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిసారు

సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరు

40 ఏళ్ల సుదీర్ఘ సేవలు ఇండియన్ ఆర్మీలో అందించిన హర్పాల్ సింగ్

వ్యూహాత్మక సొరంగాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో విశేష అనుభవం

రాష్ట్ర ప్రాజెక్టులకు తన ప్రత్యేక నైపుణ్యం తోడ్పడనుందని ఆశాభావం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ గౌరవ సలహాదారు లెఫ్ట్‌నెంట్ జనరల్ హర్పాల్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.

ఇండియన్ ఆర్మీలో నాలుగు దశాబ్దాల సేవల అనుభవం కలిగిన హర్పాల్ సింగ్ మౌలిక వసతుల ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, రక్షణ దళాలకు వ్యూహాత్మక సొరంగాలు, ఇతర కీలక వసతుల కల్పనలో అనుభవజ్ఞుడిగా పేరుగాంచారు.

తెలంగాణలో జరుగుతున్న ప్రధాన ప్రాజెక్టులకు ఆయన నైపుణ్యం ఉపయోగపడుతుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment