Site icon PRASHNA AYUDHAM

భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో హై అలర్ట్: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.. పండుగను సుఖసంతోషాలతో ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఆలయాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. శనివారం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాకు భారీ వర్షా సూచన ఉండటంతో, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటికి రాకూడదని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రమాద కారణాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, జలాశయాలు చెరువులు, కుంటలను చూడడానికి వెళ్లకూడదని, పొంగి పొర్లుతున్న వాగులను దాటడానికి ప్రయత్నించ కూడదన్నారు. జలాశయాలు నిండు కుండలా మారి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుందన్నారు. అత్యవసర సమయంలో డైల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656739 ను సంప్రదించవలసిందిగా సూచించారు. జిల్లాకు భారీ వర్షాల దృష్ట్యా పోలీసు అధికారులు, సిబ్బంది 24*7 హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ఎక్కడైనా ప్రమాద అంచున ఉన్న చెరువులు కుంటలు, వాగులు, వంతెనలు గుర్తించినట్లయితే, వాటిని చూడటానికి వెళ్ళకుండా ప్రమాద సూచిక బోర్డ్ లను ఏర్పాటు చేయాలని, జిల్లా కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించి, తగిన బందో బస్త్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆనకట్టలు, వంతెనలు దెబ్బతిన్నట్లయితే, సంబంధిత ఆర్&బీ, రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

*భారీ వర్షాల దృష్ట్యా పాటించవలసిన జాగ్రత్తలు:*

*లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.

*అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు.

*ప్రమాదాల కారణాల దృష్ట్యా చెరువులు, కుంటలను చూడటానికి వెళ్లారాదు.

*రైతులు పొలాలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలి.

*విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ చేతులతో తాకకకూడదు.

*నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లారాదు.

*వాగులు వంకలు బ్రిడ్జ్ లపై నుండి పొంగి, పొరలే సమయంలో దాటాడానికి ప్రయత్నించరాదు.

*పాడైన పాత భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల ప్రక్కన నివాసం ఉండరాదు.

Exit mobile version