Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డిలో హైకోర్టు న్యాయమూర్తి సందర్శన

IMG 20250927 182053

కామారెడ్డిలో హైకోర్టు న్యాయమూర్తి సందర్శన

రక్తదానం ప్రాణాలను కాపాడే పుణ్యకార్యం – జస్టిస్ నర్సింగరావు నందికొండ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 27

 

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, కామారెడ్డి జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ నర్సింగరావు నందికొండ శనివారం జిల్లా న్యాయస్థానాన్ని సందర్శించారు. ప్రథమ జిల్లా జడ్జి డాక్టర్ CH. V. R. R. వరప్రసాద్, జిల్లా న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు.

మొదట వృక్షార్చనలో భాగంగా న్యాయమూర్తి , జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా అటవీ అధికారి నిఖితతో పాటు పలువురు న్యాయమూర్తులు మొక్కలు నాటారు. అనంతరం లీగల్ సర్వీసెస్ అథారిటీ, రెడ్‌క్రాస్ సొసైటీ, ప్రభుత్వ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాతలకు అభినందన పత్రాలు, పండ్లు, రిఫ్రెష్‌మెంట్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన జస్టిస్ నర్సింగరావు రక్తదానం ప్రాణాలను కాపాడే పుణ్యకార్యం అని, ముఖ్యంగా థాలసీమియా బాధిత చిన్నారులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. తాను రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యుడినని గుర్తుచేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు పలువురిని సత్కరించారు. కోర్టు భవనాన్ని సందర్శించి, కామారెడ్డి జిల్లా కోర్టుకు కేటాయించిన భూమిని పరిశీలించారు.

Exit mobile version