సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 24 (ప్రశ్న ఆయుధం న్యూస్):సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం లో జూనియర్ సివిల్ జడ్జి, మొదటి శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు సూరేపల్లి నందా, అనిల్ కుమార్ ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తులను సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి సురేపల్లి నందా మాట్లాడుతూ.. కొత్తగా కోర్టును ప్రారంభించడం ద్వారా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని, కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా మన జిల్లా వాసవి అయిన తెలంగాణ జడ్జి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా కోర్టు కొత్త భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని తొందరగా కోర్టు వారికి కేటాయించాలని కలెక్టర్ ను కోరారు. అనంతరం సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న కోర్టులో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉందని, కాబట్టి కోర్టు పక్కనే ఉన్న పాత కలెక్టర్ కార్యాలయంలోని ఖాళీ స్థలాన్ని పార్కింగ్ కేటాయించాలని కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ బార్ కౌన్సిల్ సభ్యులు ప్రతాప్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా న్యాయధికారి భవానిచంద్ర, న్యాయమూర్తులు, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, సంగారెడ్డి బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ప్రధాన కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షులు భూపాల్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ మల్లేశం, లైబ్రరీ సెక్రటరీ నిజాముద్దీన్, కార్యవర్గ సభ్యులు బుచ్చయ్య, సుభాష్ చంద్ర, మాణిక్ రెడ్డి, రాములు, దత్తాత్రి భాస్కర్, వివిధ భార్ ఆసోసియేషన్ సభ్యులు సీనియర్ న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
జిన్నారంలో జూనియర్ సివిల్ కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జిలు
Oplus_131072