సంగారెడ్డి, డిసెంబర్ 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారంలో సంగారెడ్డి బార్ అసోసియేషన్‌ను శుక్రవారం హైకోర్టు సీనియర్ కౌన్సిల్ పొన్నం అశోక్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన న్యాయవాదులతో సమావేశమై, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రాధాన్యత, న్యాయవాదుల హక్కులు, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకుంటామని, బార్ కౌన్సిల్ ద్వారా మరింత బలమైన వేదికను నిర్మించాల్సిన అవసరం ఉందని భరోసా ఇచ్చారు. న్యాయ వ్యవస్థ బలోపేతానికి న్యాయవాదుల పాత్ర కీలకమని, వృత్తి గౌరవాన్ని కాపాడే విధంగా బార్ కౌన్సిల్ పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ కన్వీనర్ ఎస్. దినేష్ ముదిరాజ్, న్యాయవాదులు ఎన్.దినేష్ గౌడ్, ఆర్.శ్రీనివాస్ గౌడ్, అరుణ్ గౌడ్, రమేష్ రాజ్, మాధవి, సంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
సంగారెడ్డి బార్ అసోసియేషన్‌ను సందర్శించిన హైకోర్టు సీనియర్ కౌన్సిల్ పొన్నం అశోక్ గౌడ్
Oplus_16908288