పాత పెన్షన్ కలపై హైకోర్టు తీర్పు… DSC 2003 ఉపాధ్యాయులకు న్యాయం.

పాత పెన్షన్ కలపై హైకోర్టు తీర్పు… DSC 2003 ఉపాధ్యాయులకు న్యాయం..

 

20 ఏళ్ల నిరీక్షణకు తెర, హర్షం వ్యక్తం చేసిన టిపిటిఎఫ్ అధ్యక్షుడు చింతలలింగం.

 

ప్రశ్న ఆయుధం కామారెడ్డి, జూలై 30 (ప్రతినిధి):

DSC 2003 ద్వారా ఎంపికై 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తిస్తుందన్న హైకోర్టు తీర్పుపై ఉపాధ్యాయ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పుతో 20 ఏళ్లుగా వేచి చూస్తున్న ఉద్యోగులకు న్యాయం జరిగిందని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం పేర్కొన్నారు.

 

మంగళవారం స్థానిక వశిష్ట డిగ్రీ కాలేజీలో నిర్వహించిన టిపిటిఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ—

2004 సెప్టెంబర్ 1 ముందు నోటిఫికేషన్ వెలువడినా, నియామక ప్రక్రియలో తాత్కాలిక జాప్యం వల్ల ఉద్యోగాలు ఆ తర్వాతి తేదీల్లో లభించాయన్నారు. అయినా వారిని నూతన పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)లోకి చేర్చినందున అన్యాయం జరిగిందని చెప్పారు.

 

ఇప్పుడైతే కేంద్రం జారీ చేసిన O.M.No. 57/04/2019-P & PW (B), తేదీ 17-02-2020, మరియు తెలంగాణ హైకోర్టు W.P.No. 22559, 15644, 11398/2023పై 2025 మార్చి 19న వచ్చిన తీర్పు ప్రకారం, నియామక తేదీ కంటే ముందే నోటిఫై అయిన ఉద్యోగులకు పాత పెన్షన్ వర్తించనుందని స్పష్టం అయిందన్నారు.

 

ఈ నేపథ్యంలో, DSC 2003 ద్వారా ఎంపికై 01-09-2004 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ స్కీమ్‌ను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని టిపిటిఎఫ్ డిమాండ్ చేస్తోంది.

“ఇది ఉపాధ్యాయులే కాదు — న్యాయం కోసం పోరాడిన ప్రతి ఉద్యోగి విజయం”

— చింతల లింగం, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు

 

 

 

.

Join WhatsApp

Join Now

Leave a Comment