హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు..
ఆక్రమణ కూల్చివేతలపై దూసుకెళ్తున్న హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై న్యాయస్థానం స్టే విధించింది. స్థానికల పిటిషన్ పైన హైకోర్టు విచారణ చేసింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు అయింది. దీంతో హైకోర్టు హైడ్రాకు కీలక సూచనలు చేసింది. దుర్గం చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ హైడ్రా స్థానికులకు నోటీసులు జారీ చేసింది. నెల రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నోటీసుల పైన స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. 2014లో జారీ చేసిన ప్రిలిమరి నోటిఫికేషన్ పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రొటెక్షన్ కమిటీ స్థానికుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. అక్టోబర్ 4న ప్రొటెక్షన్ కమిటీ ముందు నివాసితులు హాజరు కావాలని కోర్టు పేర్కొంది.