ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 7 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
తక్కువ పెట్టుబడి, శ్రమతో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టి అధిక లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయధికారి లావణ్య పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం మల్లుపల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగును పరిశీలించారు. నాలుగో సంవత్సరం నుంచి దిగుబడి వస్తుందన్నారు. సాంప్రదాయ పంటలు వదిలి ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు. ఏఈఓ భువనేశ్వరి, ఆయిల్ ఫామ్ ప్రతినిధి అజయ్ పాల్గొన్నారు.