హిజ్రాల సంఘం నాయకురాలు హాసిని హత్య

*హిజ్రాల సంఘం నాయకురాలు హాసిని హత్య*

నెల్లూరు ప్రభుత్వాస్పత్రి వద్ద బైఠాయించిన ట్రాన్స్ జెండర్లు

ఓ హిజ్రా నాయకురాలిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. అమ్మవారి గుడికి వెళ్లి పూజలు చేసి తిరిగి వస్తుండగా దారి కాచిన దుండగులు దారుణంగా మారణాయుధాలతో దాడి చేసినట్లు సమాచారం.*

హిజ్రాల నాయకురాలు హాసిని మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం టపా తోపు వద్ద దుండగులు దారికాచి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.*

హిజ్రా నాయకురాలు హాసినిని చంపేందుకు దుండగులు రెండు కార్లలో వచ్చినట్టు సమాచారం. గాయపడిన హాసినిని 108లో నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే హాసిని మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పార్లపల్లి గ్రామంలోని గుడిలో పూజలు నిర్వహించి.. తిరిగి వస్తుండగా దుండగులు హత్య చేశారు. 

ఈ సంఘటన నేపథ్యంలో ట్రాన్స్ జెండర్లు తీవ్రంగా స్పందించారు. దీంతో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రితో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. తమ నాయకురాలు హత్యకు గురైన సమాచారం అందుకున్న నెల్లూరు, తిరుపతి నుంచి భారీ సంఖ్యలో హిజ్రాలు జీజీహెచ్ వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ఆసుపత్రి మార్చురీ వద్దకు చేరుకున్న హిజ్రాలు ధర్నా చేస్తున్నారు.

తమ నాయకురాలిని హత్య చేసిన దుండగులను అరెస్టు చేయాలి” అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో హిజ్రాలు నెల్లూరు జిజిహెచ్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు కూడా ఊహించని రీతిలో పెద్ద సంఖ్యలో మోహరించారు. అవాంఛనీయ సంఘటనల కు ఆస్కారం లేకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment