కొండ లక్మణ్ బాపూజీ జయంతి ఘనంగా
నిజాం నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు
— జిల్లా కలెక్టర్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 27
జిల్లా కేంద్రంలోని C.S.I చర్చి ఎదురుగా గల కొండ లక్మణ్ బాపూజీ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాపూజీ జయంతి శనివారం ఘనంగా నిర్వహించబడింది.జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, నిజాం నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయ నేత, తెలంగాణ తొలి మరియు మలిదశ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించారని తెలిపారు. ఆయన పోరాట పటిమ నేటితనానికి ఆదర్శమని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్, సహాయ అధికారి చక్రధర్, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, రాజయ్య, నాగరాజు, ఆజాద్, వినోద్, పవన్, జీవన్, శాంతయ్య, నరేష్, TNGOs జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, కార్యదర్శి నాగరాజు, బీసీ సంఘం, పద్మశాలి సంఘం నాయకులు షేర్ల రాములు, లక్మి నర్సింలు, చాట్ల రాజేశ్వర్, సబ్బాని హరి, అవధూత నరేందర్, జిల్లా అధికారులు మరియు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.