ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా హిందీ దివస్ సమారోహ
ప్రశ్న ఆయుధం , సెప్టెంబర్ 28, కామారెడ్డి :
సెప్టెంబర్ 14 ను పురస్కరించి హిందీ దివస్‌ని వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందీ దివస్ సమారోహ సందర్భంగా శనివారం ప్రభుత్వఆర్ట్స్ & సైన్స్ డిగ్రీ కాలేజి కామారెడ్డి కళాశాలలో హిందీ విభాగ అధ్యక్షులు డా. జి. శ్రీనివాస రావు ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వవిద్యాలయం, హిందీ విభాగం ప్రొఫెసర్ డా. పార్వతి మేడం అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ… స్వాతంత్రోద్యమంలో సాధారణ ప్రజలందరినీ ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఎంతో ఉపయోగ పడిందని, భాష యొక్క ఔన్నత్యం ఎంతో గొప్పదని తెలిపారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర అధికార భాష హిందీ అని, దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం కాపాడటంలో హిందీ భాషకు ఎంతో ప్రాధాన్యత ఉందని కొని యాడారు. కళాశాల హిందీ విభాగ అధిపతి డా. జి. శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషలలో హిందీ భాషది రెండవ స్థానం అని తెలియజేశారు. మన అధికారిక భాష హిందీ సంస్కృత భాష, దేవనాగరి లిపితో గ్రహించబడిన మన దేశ మాతృభాష హిందీ అని ప్రశంసించారు. ప్రస్తుత తరుణంలో సాంకేతికంగా పరివర్తనం చెందుతున్న సందర్భంలో ప్రతి ఒకరు హిందీని నేర్చుకొని ఉపాధి అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు. ‘హిందీ దివాస్’ పురస్కరించుకొని క్విజ్, వ్యాస రచన, వకృత్వ, కవితా రచన పోటీలు నిర్వహించి విద్యార్థులకు మెమొంటో, ప్రశంస పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. కె. కిష్టయ్య, తెలుగు విభాగ అధిపతి డా. పి. విశ్వప్రసాద్, అధ్యాపకులు లక్శ్మణ్ చారి, డా. వేంకటేశ్వర్లు, రాజ గంభీర్, జయ ప్రకాశ్, బాలాజి, రవి, మల్లేష్ బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.