హిందీ సాహిత్య మే సూఫీ కావ్య పరంపర
ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :
ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డి హిందీ విభాగపు అధిపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ హిందీ డాక్టర్ జి శ్రీనివాసరావు బుధవారం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ హిందీ విభాగం నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సెమినార్లో ‘హిందీ సాహిత్య మే సూఫీ కావ్య పరంపర ‘ అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు. అనంతరం పత్ర సమర్పణ చేసిన వారికి ప్రమాణ పత్రం, జ్ఞాపికతో సత్కరించారు.
ఈ కార్యక్రమానికి సమన్వయకర్త మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రొఫెసర్ డీన్ హిందీ విభాగం పఠాన్ ఖాన్, శేషుబాబు వివిధ కళాశాల ప్రొఫెసర్లు, విభాగాధిపతులు సహాయ ఆచార్యులు జాతీయ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం నుండి శ్రీలంక, జపాన్, సింగపూర్, మలేషియా ఫిజి తదితర దేశాల హిందీ ప్రచార ప్రసార విభాగ్యపతులు, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.