అక్రమ అరెస్టులు దురదృష్టకరం
రేవంత్ రెడ్డి పాలనలో హిందువులకు స్వేచ్ఛ లేదు
అక్రమ అరెస్టులను ఖండించిన బిజెపి నాయకులు
*జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 12 ప్రశ్న ఆయుధం*
హైదరాబాద్లోని పెద్దమ్మగుడి దగ్గర కుంకుమార్చనకు హిందూ సంఘాల పిలుపు మేరకు హైదరాబాదుకు బయలుదేరుతున్నారనే సమాచారంతో ముందస్తుగా బీజేపీ నాయకులను, హిందూ సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ అరెస్ట్ లకు నిరసన తెలుపుతూ మంగళవారం రోజున ఇల్లందకుంట మండల కేంద్రం లో మీడియా సమావేశం నిర్వహించిన బీజేపీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి, మాట్లాడుతూ అక్రమ అరెస్టులు దురదృష్టకరం,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెద్దమ్మగుడి దగ్గర కూల్చివేతలు చేపట్టడాన్ని హిందూ సంఘాలు భారీ ఎత్తున వ్యతిరేకించడం జరిగిందని ఈ నేపథ్యంలో హిందూ సంఘాల పిలుపుమేరకు చేపట్టబోయే కుంకుమార్చన కార్యక్రమాన్ని అడ్డుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దురదృష్టకరమణి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు రేవంత్ రెడ్డి పాలనలో స్వేచ్ఛ లేదు అని ఆరోపించారు..ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుత్తికొండ రాంబాబు బీజేవైఎం మండల అధ్యక్షుడు రావుల విజయ్ బాబు, చిప్పతి శ్రీకాంత్, కోడం భరత్ తదితరులు పాల్గొన్నారు