ఆయన పేరు పాడి కౌశిక్ రెడ్డి కానీ పాడు కౌశిక్ రెడ్డి

*ఆయన పేరు పాడి కౌశిక్ రెడ్డి కానీ పాడు కౌశిక్ రెడ్డి*

*కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాసాల రామస్వామి*

*జమ్మికుంట జనవరి 15 ప్రశ్న ఆయుధం*

హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పాడి కానే కాదు పాడు కౌశిక్ రెడ్డి అని కాంగ్రెస్ నాయకుడు వాసాల రామస్వామి అన్నారు. జమ్మికుంట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి చేస్తున్న చర్యలను చూస్తే హుజురాబాద్ నియోజకవర్గoలో ఉన్న ప్రజలు తలదించుకునే పరిస్థితి వస్తుందని ఇవాళ ఈ పాడు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి హుజురాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు దళిత బంధు ప్రవేశపెట్టినప్పుడు అందులో నేను కూడా వన్ అఫ్ ది డైరెక్టర్ నని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నేను కలెక్టర్ తో అందరం కూర్చొని దళిత బంధును పైలట్ ప్రాజెక్టు కింద దళితులకు అందించడం జరిగిందని మొన్న వచ్చినటువంటి ఎలక్షన్లో కౌశిక్ రెడ్డికి ఓట్లు పడతయో పడయో అని ఏకైక ఉద్దేశం కొద్దీ అప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఈడీని సెలవులలో పంపించి ఈ దళిత బందును సెకండ్ విడత ఆపించింది నువ్వు కాదా కౌశిక్ రెడ్డి అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర సాధనలో నీ పాత్ర టిఆర్ఎస్ ఎదుగుదలలో, రాష్ట్ర అభివృద్ధిలో నీ పాత్ర ఏంటి అని మండిపడ్డారు. ఈ దళిత బందు పైలెట్ ప్రాజెక్టు అనేది ఈటల రాజీనామా వల్ల మాత్రమే వచ్చిందని ఈ హుజురాబాద్ దళిత ప్రజలకు దళిత బంధు అనే పథకం వచ్చిందని పేర్కొన్నారు దళిత బంధు పథకాన్ని అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎలాంటి షరతులు లేకుండా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ కౌశిక్ రెడ్డి తన స్వార్థం కోసం ఈ దళిత బందును ఆపుదల చేయించి, అప్పుడున్నటువంటి ఎన్నికలలో మేము చచ్చిపోతామని ఓట్లు వేయించుకుంది నువ్వు కాదా కౌశిక్ రెడ్డి అని పేర్కొన్నారు. హుజురాబాద్ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేస్తున్నావ్ అని మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ముగ్గురు మంత్రులు ముగ్గురు కలెక్టర్ల ఆధ్వర్యంలో అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరుగుతుంటే అందులో నీ ప్రజలకు నీ ప్రాంతానికి నియోజకవర్గానికి ఏమి కావాలో అడగకుండా జిల్లా కేంద్రం నడి ఒడ్డున హుజురాబాద్ పరువు తీసి, హుజురాబాద్ అస్తిత్వo పై దెబ్బ కొడుతున్నావని అన్నారు.ఆ రోజున తెలంగాణ ఉద్యమకారులను ప్రజలను కొట్టిన చరిత్ర నీది కాదా అని ప్రశ్నించారు. దళితుల మీద ప్రేమే ఉంటే, నువ్వు కూడా రాజీనామా చెయ్, రెండో విడత దళిత బంధు వస్తుందని వివరించారు. ఒకవేళ రాకపోతే కాంగ్రెస్ కార్యకర్తలుగా ముఖ్యమంత్రి ఇంటిముందు ధర్నా చేస్తామని, దళిత బంధు వచ్చేదాకా పోరాడుతామని, వివరించారు. ఈరోజు నా హుజురాబాద్ లో చిన్న పిల్లవాడు కూడా నిన్ను చూస్తే, నవ్వుకునే పరిస్థితి వచ్చింది కౌశిక్ రెడ్డి అని అన్నారు. పిచ్చి లేసినట్టుగా, ఆగమాగం చేస్తున్నావని మండిపడ్డారు. దళిత ప్రజలారా,దళిత సోదరులారా, ఆలోచించండి, ప్రజల మీద ప్రేమ లేని కౌశిక్ రెడ్డి తో, తిరగకండి, ప్రజల మీద నిజమైన ప్రేమే ఉంటే, ఈటెల రాజేందర్ రాజీనామా చేస్తే వచ్చిన అభివృద్ధి నిధులు, మన దళిత బంధు, మళ్లీ కౌశిక్ రెడ్డి రాజీనామా తో సెకండ్ విడత దళిత బంధు, నియోజకవర్గ అభివృద్ధికి చాలా నిధులు వస్తాయి ఆలోచన చేయండి అని తెలిపారు. కౌశిక్ రెడ్డి దళితుల పట్ల హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పట్ల హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామనే ఉద్దేశమే గనుక నీకు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాసాల రామస్వామి తో పాటు కాంగ్రెస్ నాయకులు చిలివేరి రాజమౌళి, మ్యాకమల్ల వెంకటేష్, రాచపల్లి సాగర్, రాచపల్లి గణేష్, కుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now