*_HKU1 | మళ్లీ కరోనా కలకలం..! కోల్‌కతా మహిళకు హెచ్‌కేయూ1 పాజిటివ్..!!_*
కోల్‌కతా: కోల్‌కతాలోని ఓ మహిళ అత్యంత అరుదైన ‘హ్యూమన్ కరోనా వైరస్’ (హెచ్‌కేయూ1) బారినపడ్డారన్న సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలో చికిత్స పొందుతున్న ఆమెను ఐసొలేషన్ ఉంచినట్టు వైద్యులు తెలిపారు.
45 ఏండ్ల మహిళ గత 15 రోజులుగా జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని, దక్షిణ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిసింది. హెచ్‌కేయూ1 సాధారణంగా తేలికపాటి శ్వాసకోశ వ్యాధులతో ముడిపడి ఉంటుందని, ఇది మహమ్మారిగా మారే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. హెచ్‌కేయూ1..అనేది కరోనా వైరస్‌లోని ‘బీటా కరోనా వైరస్ హాంకానెన్స్’ రకానికి చెందినదని, ఈ వైరస్‌కు ప్రత్యేక చికిత్స, వ్యాక్సిన్ గానీ లేదు.
ఫిట్ ఇండియా ఐకాన్‌గా ఆయుష్మాన్ ఖురానా
న్యూఢిల్లీ: నటుడు ఆయుష్మాన్ ఖురానాను ఫిట్ ఇండియా ప్రచారకర్త(ఐకాన్)గా కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సోమవారం ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన ఫిట్ ఇండియా ప్రారంభోత్సవంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ప్రజలు తమ దేహ దారుఢ్యం, సంపూర్ణ ఆరోగ్యంపై దృష్టి సారించేలా చేసే ఫిట్ ఇండియా ఉద్యమంలో 40 ఏండ్ల ఖురానా భాగస్వాములయ్యారని క్రీడల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రోజువారీ కార్యక్రమాల్లో శారీరక వ్యాయామాన్ని భాగం చేస్తూ ఫిట్‌నెస్ పెంచుకొనే విషయాన్ని ప్రచారం చేయాలనేది ఈ ఉద్యమ లక్ష్యం.