Site icon PRASHNA AYUDHAM

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో హోలీ సంబరాలు

IMG 20250314 122247

Oplus_131072

IMG 20250314 121955
సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పోలీసు గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హోలీ కార్యక్రమాలలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్వయంగా పాల్గొని అధికారులకు సిబ్బందికి రంగులు పూసి, హోలీ పండుగ శుభాాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… ఈ రంగుల హోలీని ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని సూచించారు. బలవంతపు రంగులు పూయడం, మద్యం తాగి, వాహనాలు నడుపుతూ ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని అన్నారు. మద్యం సేవించి చెరువులు, వెళ్లరాదని, జలాశయాల వద్ద లోతట్టు ప్రాంతాలలో తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు.
Exit mobile version