Site icon PRASHNA AYUDHAM

వయోబేధాలు మరిచి జరుపుకునే పండుగ హోలీ

IMG 20250314 WA0082

*వయోబేధాలు మరిచి జరుపుకునే పండుగ హోలీ*

* ఒక్కరి జీవితం రంగుల మయం కావాలి*

*బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు*

*జమ్మికుంట మార్చి 14 ప్రశ్న ఆయుధం*

హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం రోజున జమ్మికుంట పట్టణంలో బిజెపి శ్రేణులు ఒకరికొకరు రంగులు చల్లుకొని ఘనంగా హోలీ ఉత్సవాలు జరుపుకున్నారు. ఉదయాన్నే బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున గాంధీ చౌరస్తా చేరుకొని పట్టణ పుర ప్రముఖులతో కలిసి హోలి సంబరాల్లో మునిగి తేలారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెల్లి జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి పోలీస్ సిబ్బందికి రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, జమ్మికుంట పట్టణ బిజెపి మాజీ అధ్యక్షుడు జీడి మల్లేష్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ఒక రంగుల హరివిల్లు అని, కాలానికి అనుగుణంగా మనలో ఆనందాలు నింపే పండుగలతో గొప్పగా శోభిస్తుందని వసంత రుతువు ప్రారంభంలో వచ్చే హోళీ అయితే ప్రత్యేకమైనదని, వయోభేదాలు మరిచి అందరూ వసంతాలాడి మైమరిచే రంగుల పండుగ హోళీ. పండగ అని, హోళీ వెనుక సంప్రదాయ విశేషాలెన్నో ఉన్నాయని,వసంతాగమనంతో ప్రకృతి నవవధువులా ముస్తాబవుతుందని, ఆకుపచ్చని పొదరిళ్లు పూలపూతలతో పులకరిస్తాయని, ఆమని రాకతో ఆనందం తొంగిచూస్తుందని, అంతటా చైతన్యం వెల్లివిరుస్తుందని, వసంత పంచమికి ప్రకృతి అంతా వసంతం లక్షణాలు అంకురిస్తే, హోళీ పర్వదినంనాటికి వాసంత సౌకుమార్యం పరిపూర్ణంగా ప్రకటితమవుతుందని బిజెపి నాయకులు తెలిపారు. ఫాల్గుణోత్సవం, కల్యాణ పూర్ణిమ, వసంత పున్నమి, హుతాశని పౌర్ణమి, కాముని పున్నమి, మదనోత్సవం, డోలా పూర్ణిమ, అనంగ పూర్ణిమ ఇలా ఎన్నో పేర్లతో ఫాల్గుణ పూర్ణిమ నాడు హోళీ పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారని బిజెపి నాయకులు గుర్తు చేశారు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగును నింపి,అందరూ ఆయురారోగ్యాలతో, అష్ట, ఐశ్వర్యాలతో ఉండాలని, రైతులు పాడి,పంటలతో వెదజిల్లాలని భగవంతున్ని బిజెపి నాయకులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, శీలం శ్రీనివాస్, జీడి మల్లేష్, పల్లపు రవి రాజేష్ ఠాగూర్ కైలాస కొట్టి గణేష్ మోతే స్వామి మోడేo రాజు బూరుగుపల్లి రామ్ ఠాగూర్ రాకేష్ అప్పల రవీందర్ కృష్ణ దేవా షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు

Exit mobile version